అస్సాంలో ఇవాళ(బుధవారం) ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఉదయం 7.51 గంటల సమయంలో సోనిత్‌పూర్‌లో 6.4 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. రెండో సారి మళ్ళీ 8.13 గంటలకు.. 8.34 గంటలకు మూడోసారి ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. వరుసగా మూడుసార్లు ప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఉత్తర బెంగాల్‌లోనూ ప్రకంపనలు వచ్చాయి. కూచ్ బెహార్, మాల్దా, జల్పాయిగురి, సిలిగురి, ముర్షిదాబాద్ తదితర ప్రాంతాల్లో భూమి కంపించినట్టు తెలిసింది. అయితే ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు తమకు ఎలాంటి నివేదికలు అందలేదని తెలిపారు అధికారులు.
