హైదరాబాద్లో మరో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్లో మరో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్​లో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. రామంతపూర్ వద్ద ఈజీ ఫ్లైవుడ్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో పెద్ద ఎత్తున మంటల చెలరేగాయి. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో గోదాం కాలి బూడిదైంది. ఉదయం 7.30గంటల ప్రాంతంలో మంటలను గమనించిన సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని చర్యలు చేపట్టారు.

ఆ తర్వాత మూడు ఫైరింజన్లతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. దట్టంగా పొగ అలుముకోవడంతో స్థానికులు ఇబ్బందులకు గురైయ్యారు. షార్ట్ సర్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.