సీఎంఆర్ షాపింగ్ మాల్​లో భారీ అగ్ని ప్రమాదం

  సీఎంఆర్ షాపింగ్ మాల్​లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్, వెలుగు: సీఎంఆర్ షాపింగ్ మాల్​లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉప్పల్ బస్టాప్ ఎదురుగా ఉన్న సీఎంఆర్ షాపింగ్ మాల్​లో మంగళవారం రాత్రి 10 గంటలకు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే భారీగా వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడడంతో స్థానికులు  భయాందోళనకు గురయ్యారు. బస్టాప్​లో ఉన్న ప్యాసింజర్లు అక్కడి నుంచి పరుగులు తీశారు. 

షాపింగ్ మాల్ ముందు ఉన్న ఫ్లెక్సీలు, హోర్డింగ్ పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 4 ఫైరింజన్లతో అక్కడికి చేరుకున్నారు. గంటకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో మాల్ లో సిబ్బంది, కస్టమర్లు లేరని నిర్వాహకులు తెలిపారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని ఫైర్ అధికారులు భావిస్తున్నారు.