ఛత్తీస్‌‎గఢ్‌‎లో భారీగా మావోయిస్ట్‌‎ల డంప్‌‌‌‌‌‌‌‌ స్వాధీనం

ఛత్తీస్‌‎గఢ్‌‎లో భారీగా మావోయిస్ట్‌‎ల డంప్‌‌‌‌‌‌‌‌ స్వాధీనం

భద్రాచలం, వెలుగు: చత్తీస్‌‎గఢ్‌‌‌‌‌‌‌‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మావోయిస్ట్‌‎ల డంప్‌‎‌‌‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మెట్టగూడ బేస్‌‌‌‌‌‌‌‌ క్యాంప్‌‌‌‌‌‌‌ పరిధిలోని ఎరాపల్లి, కోయిమెంట, దరేలీ, బోటెలంక, మార్కన్‌‌‌‌‌‌‌‌గూడ అడవుల్లో కోబ్రా, సీఆర్‌‌‌‌‌‌‌‌పీఎఫ్‌‌‌‌‌‌‌‌, బస్తర్‌‌‌‌‌‌‌‌ఫైటర్స్‌‌‌‌‌‌‌‌జవాన్లు కూంబింగ్‌‌‌‌‌‌‌‌చేస్తున్నారు. ఈ క్రమంలో మావోయిస్ట్‌‎లు దాచిపెట్టిన రైఫిల్స్, బీజీఎల్‌‌‌‌‌‌‌‌ లాంచర్లు, లాంచర్‌‌‌‌‌‌‌‌ బ్యారెల్స్‌‌‌‌‌‌‌, విరిగిన యుఏవీ నేత్రా ప్రొపెల్లర్, ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ హోల్డర్‌‌‌‌‌‌‌‌ వెల్డింగ్‌‌‌‌‌‌‌‌, బెంచ్‌‌‌‌‌‌‌‌ వైస్‌‌‌‌‌‌‌‌, స్టీల్‌‌‌‌‌‌‌‌పైపులు, ఇనుప రాడ్స్, ఇనుప బేస్​ప్లేట్, పోల్‌‌‌‌‌‌‌‌ యాంగ్లర్‌‌‌‌‌‌‌‌, ఇనుప క్లాంప్, గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ సపోర్టర్‌‌‌‌‌‌‌‌, బ్లాక్‌‌‌‌‌‌‌‌ యూనిఫామ్స్‌‌‌‌‌‌‌‌, మందుగుండు సామగ్రి, విరిగిన ఇన్వర్టర్‌‌‌‌‌‌‌‌ బ్యాటరీ కేసింగ్‌‌‌‌‌‌‌‌, ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ వైర్‌‌‌‌‌‌‌‌, ఎక్స్‌‌‌‌‌‌‌‌టెన్షన్‌‌‌‌‌‌‌‌ బోర్డును స్వాధీనం చేసుకొని జిల్లా కేంద్రానికి తరలించారు.