బీమా కంపెనీల భారీ రిక్రూట్‌‌మెంట్‌

బీమా కంపెనీల భారీ రిక్రూట్‌‌మెంట్‌

న్యూఢిల్లీ జాబ్‌‌‌‌ కోసం వెతుకుతున్న వారు ఇన్సూరెన్స్‌‌‌‌ కంపెనీలను ట్రై చేయడం మరచిపోకండి. దేశంలోని టాప్‌‌‌‌ 5 ఇన్సూరెన్స్‌‌‌‌ కంపెనీలు 5,000 లకు పైగా ఉద్యోగాలను ఆఫర్‌‌‌‌‌‌‌‌ చేయనున్నాయి. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ ముగిసిన తర్వాత ఇన్సూరెన్స్‌‌‌‌ బిజినెస్‌‌‌‌కు డిమాండ్‌‌‌‌ ఉంటుందని ఈ కంపెనీలు భావిస్తున్నాయి. దీంతో పాటు ప్రభుత్వ బ్యాంకుల మెర్జింగ్‌‌‌‌ జరగడంతో వీటికి చెందిన ఇన్సూరెన్స్‌‌‌‌ కంపెనీలలో కూడా మార్పులు మొదలయ్యాయి. ఈ కంపెనీల కస్టమర్ల బేస్‌‌‌‌ పెరిగింది. దీంతో కొత్తగా ఉద్యోగులను రిక్రూట్‌‌‌‌ చేసుకోవడానికి ఈ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. జనరల్‌‌‌‌, లైఫ్‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌ ఈ రెండు సెగ్మెంట్లలో కూడా సమానమైన అవకాశాలు ఉన్నాయని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు.  పీఎన్‌‌‌‌బీ మెట్‌‌‌‌లైఫ్‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌ జూన్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో 1,500 మందిని రిక్రూట్‌‌‌‌ చేసుకోనుందని చెప్పారు.

ఈ ఏడాదిలో ఈ నెంబర్‌‌‌‌‌‌‌‌ మూడు వేలకు చేరుతుందని అంచనావేశారు. కెనరా హెచ్‌‌‌‌ఎస్‌‌‌‌బీసీ ఓబీసీ లైఫ్‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌ కంపెనీ కూడా జూన్‌‌‌‌ చివరి నాటికి వెయ్యి మందికి పైగా రిక్రూట్‌‌‌‌ చేసుకోవాలని ప్లాన్స్‌‌‌‌ వేస్తోందని అన్నారు. ఈ కంపెనీ ప్రమోటర్లయిన కెనరా బ్యాంక్‌‌‌‌, ఓరియంటల్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ కామర్స్‌‌‌‌లు(ఓబీసీ) వేరే బ్యాంకులతో మెర్జ్‌‌‌‌ అయిన విషయం తెలిసిందే.  మరోవైపు టాటా ఏఐజీ సుమారు వెయ్యి మందిని రిక్రూట్‌‌‌‌ చేసుకోవాలని ప్లాన్స్‌‌‌‌ వేస్తోందని సంబంధిత వ్యక్తులు అన్నారు. ‘టాటా ఏఐఏ లైఫ్‌‌‌‌ 50‌‌‌‌‌‌‌‌0 మందిని నియమించుకోనుంది. రిలయన్స్‌‌‌‌ నిప్పన్‌‌‌‌ మే నెలలో 300 మందికి ఉద్యోగాలిచ్చింది. మరో 400 మందిని జూన్‌‌‌‌లో రిక్రూట్‌‌‌‌ చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది’ అని పేర్కొన్నారు. కరోనా దెబ్బతో  ఇన్సూరెన్స్‌‌‌‌ సెక్టార్లో సేల్స్‌‌‌‌ పెరుగుతాయని ఈ కంపెనీలు  భావిస్తున్నాయి.

కరోనాతో ఇన్సూరెన్స్‌‌‌‌కు డిమాండ్‌‌‌‌!

ఇన్సూరెన్స్‌‌‌‌ కంపెనీలు తమ హైరింగ్‌‌‌‌ యాక్టివిటీని పెంచుతున్నాయని టీమ్‌‌‌‌లీజ్ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌ హెడ్‌‌‌‌ అజయ్‌‌‌‌ షా అన్నారు. కరోనా దెబ్బతో లైఫ్‌‌‌‌కు, వ్యాపారాలకు ఇన్సూరెన్స్‌‌‌‌ చేసుకోవడం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. పేరెంట్‌‌‌‌ కంపెనీ లెవెల్లో మెర్జింగ్‌‌‌‌ ప్రాసెస్‌‌‌‌లు జరగడంతో కూడా కొత్తగా రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ జరుగుతోందని అన్నారు. సేల్స్‌‌‌‌, డిజిటల్‌‌‌‌, బ్యాంకెష్యూరెన్స్‌‌‌‌(ఇన్సూరెన్స్‌‌‌‌ ప్రొడక్ట్‌‌‌‌లను బ్యాంక్‌‌‌‌లు అమ్మడం)  సెగ్మెంట్లలో ఎక్కువగా హైరింగ్‌‌‌‌ జరుగుతుందని తెలిపారు. కాగా యూనైటెడ్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇండియా, ఓబీసీలు తాజాగా పంజాబ్‌‌‌‌ నేషనల్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌(పీఎన్‌‌‌‌బీ)లో విలీనమయ్యాయి. పంజాబ్‌‌‌‌ నేషనల్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌కు పీఎన్‌‌‌‌బీ మెట్‌‌‌‌లైఫ్‌‌‌‌లో 30 శాతం వాటా ఉంది. మరోవైపు కెనరా హెఎస్‌‌‌‌బీసీ ఓబీసీ లైఫ్‌‌‌‌లో ఓబీసీ బ్యాంక్‌‌‌‌కు వాటా ఉంది. ఈ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ ప్రాసెస్‌‌‌‌కు సంబంధించి పీఎన్‌‌‌‌బీ స్పందించలేదు. కెనరా హెచ్‌‌‌‌ఎస్‌‌‌‌బీసీ ఓబీసీ లైఫ్‌‌‌‌, టాటా ఏఐఏ లైఫ్‌‌‌‌, టాటా ఏఐజీ కూడా రెస్పాండ్‌‌‌‌ అవ్వలేదు.

చాలా వరకు కంపెనీలు తమ డిజిటల్‌‌‌‌ సామర్ధ్యాన్ని పెంచుకుంటున్నాయి. దీంతో ఈ విభాగంలో జాబ్‌‌‌‌ క్రియేషన్‌‌‌‌ జరుగుతోంది. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ ఎఫెక్ట్‌‌‌‌ మొదట్లో తీవ్రంగా ఉందని రిలయన్స్‌‌‌‌ నిప్పన్‌‌‌‌ సీఈఓ ఆశిష్‌‌‌‌ వోహ్రా అన్నారు. డిజిటల్‌‌‌‌ సామర్ధ్యం తక్కువగా ఉండడంతో లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ మొదట్లో 80 శాతం సేల్స్‌‌‌‌ పడిపోయాయని,  సగానికి పైగా రీ కలెక్షన్‌‌‌‌ తగ్గిందని చెప్పారు.  అయినప్పటికీ బిజినెస్‌‌‌‌ గ్రోత్ క్రమంగా మెరుగుపడుతున్నదని అన్నారు.  కస్టమర్‌‌‌‌‌‌‌‌ సైడ్‌‌‌‌ నుంచి డిమాండ్‌‌‌‌ ఉందనే విషయం దీని ద్వారా తెలుస్తోందని పేర్కొన్నారు. అందుకే కొత్తగా రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ను స్టార్ట్‌‌‌‌ చేశామని చెప్పారు. ఇన్సూరెన్స్‌‌‌‌ ఇండస్ట్రీ ప్రత్యక్షంగా ఆరు లక్షల మందికి  ఉపాధి ఇచ్చింది. ఇందులో కాంట్రాక్ట్‌‌‌‌ వర్కర్లను కూడా కలుపుకుంటే ఈ నెంబర్‌‌‌‌‌‌‌‌ మరింత పెరుగుతుంది.

మరిన్ని వార్తల కోసం

ఉద్యోగం పోతే ఈఎంఐ రద్దు

11 అంకెల సెల్ ఫోన్ నెంబర్లు రాబోతున్నాయి

కరోనా కన్నా రాక్షసం ఈ మనుషులు..