ఉత్తరప్రదేశ్ బారాబంకి జిల్లాలో ఘోర ప్రమాదం

 ఉత్తరప్రదేశ్ బారాబంకి జిల్లాలో ఘోర  ప్రమాదం
  • నలుగురు మృతి.. మరో 14 మందికి గాయాలు
  • నేపాల్ నుంచి గోవాకు వెళ్తున్న బస్సు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకి జిల్లాలో ప్రమాదం జరిగింది. బస్సును ట్రక్కు ఢీకొనడంతో.. నలుగురు చనిపోయారు. నేపాల్ నుంచి గోవాకు వెళ్తున్న బస్సుగా గుర్తించారు అధికారులు. బస్సు టైర్ పంక్చర్ అవ్వడంతో.. రోడ్డు పక్కన ఆపి ఉంచారు. తెల్లవారు జామున రోడ్డు పక్కన ఆగి ఉన్న బస్సుపైకి ట్రక్కు దూసుకెళ్లింది. దీంతో 14 మంది గాయపడ్డారు. యాక్సిడెంట్ టైంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించారు. వారిని తిరిగి నేపాల్ కు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.