మళ్లీ విజృంభిస్తున్న కరోనా

మళ్లీ విజృంభిస్తున్న కరోనా

కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. రోజువారీ నమోదవుతున్న కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య ముంబైలో 70, ఢిల్లీలో 50శాతం మేర పెరిగాయి. మహారాష్ట్రలో ఈ రోజు మొత్తం 2,171 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. 1377 కేసులు ఒక్క ముంబైలోనే నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,098 మంది కరోనా నుంచి కోలుకోగా.. 22 మంది చనిపోయారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 11,492 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే మంగళవారం మహారాష్ట్రలో ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదుకాకపోవడం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 167 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి.

ఢిల్లీలోనూ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కేజ్రీవాల్ సర్కారు ఎల్లో అలర్ట్ జారీచేసిన రోజునే దేశ రాజధానిలో కరోనా కేసుల సంఖ్య 50శాతం వరకు పెరిగింది. ఇవాళ ఢిల్లీలో కొత్తగా 496 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయింది. గత 24 గంటల్లో 172 మంది రికవర్ కాగా.. ఒకరు చనిపోయారు. ప్రస్తుతం ఢిల్లీలో 1612 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

కేరళలో ఇవాళ కొత్తగా 2,472 కరోనా కేసులు నమోదుకాగా.. 38 మంది మృతి చెందారు. గత 24గంటల్లో 3,052మంది కోలుకోగా.. ప్రస్తుతం కేరళలో 20,400 యాక్టివ్ కేసులున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 

మరిన్ని వార్తల కోసం..

రాష్ట్రంలో కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు

100% ఫస్ట్ డోస్ పూర్తి చేసుకున్న మొదటి రాష్ట్రం తెలంగాణ