ఫార్మాట్ మారినా పాక్ అంతే: చెత్త ఫీల్డింగ్‌తో ఒక్క బంతికి 7 పరుగులు

ఫార్మాట్ మారినా  పాక్ అంతే: చెత్త ఫీల్డింగ్‌తో ఒక్క బంతికి 7 పరుగులు

పాక్ క్రికెట్ ఫీల్డింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న వీరి ఫీల్డింగ్ విన్యాసాలు నవ్వు తెప్పిస్తాయి. పేలవ ఫీల్డింగ్ తో గల్లీ క్రికెట్ ను గుర్తుకు తెస్తారు. ఫీల్డింగ్ తప్పిదాలతో ఒకరినొకరు తప్పు పడుతూ చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తారు. ఆసియా కప్, వరల్డ్ కప్ లో పాక్ చెత్త ఫీల్డింగ్ విన్యాసాలు చూపించిన వీరు ఫార్మాట్ మారినా తమ ఫీల్డింగ్ లో మార్పు రాలేదు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో ఒక్క బంతికి 7 పరుగులిచ్చి మూల్యం చెల్లించుకున్నారు.
 
ఆస్ట్రేలియాతో మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా కంగారు గడ్డ మీద అడుగుపెట్టిన పాక్.. ప్రస్తుతం ఆస్టేలియా ప్రైమ్ మినిస్టర్స్ XI తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది. ఇందులో భాగంగా  24వ ఓవర్ లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఓవర్ లో పాక్ ఆఫ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ వేసిన చివరి బంతిని ఆస్ట్రేలియా బ్యాటర్ రెన్షా కవర్స్ లో బంతిని కొట్టాడు. మీర్ హమ్జా ఫుల్ స్ట్రెచ్ డైవ్ చేసి బంతిని ఆపగా ఆపగా అప్పటికే మూడు పరుగులు వచ్చాయి. ఇక హమ్జా విసిరిన ఈ బంతి నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న బాబర్ వికెట్ కీపర్ వైపు వేగంగా విసిరాడు. 

ఈ బంతిని అందుకోవడంలో సర్ఫరాజ్ తో పాటు కెప్టెన్ షాన్ మసూద్ విఫలమయ్యారు. దీంతో ఓవర్ త్రో రూపంలో పాకిస్థాన్ కు అదనంగా మరో నాలుగు పరుగులు వచ్చాయి. దీంతో ఒక్క బంతికి 7 పరుగులు ఆసీస్ ఖాతాలో వచ్చి చేరాయి. 47 పరుగుల వద్ద ఉన్న రెన్షా ఒక్కసారిగా 54 పరుగులకే చేరుకున్నాడు. టెస్టుల్లో కూడా పాక్ తన చెత్త ఫీల్డింగ్ ను కొనసాగిస్తోంది.
 
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 9 వికెట్ల నష్టానికి 391 పరుగులు చేసింది. కొత్త కెప్టెన్ షాన్ మసూద్  298 బంతుల్లో 14 ఫోర్లు మరియు ఒక సిక్సర్ సహాయంతో 201 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు ఆస్ట్రేలియా 3 వికెట్లను 215 పరుగులు చేసి ధీటుగా పోరాడుతుంది.