‘కడారి’కి కన్నీటి వీడ్కోలు ..స్వగ్రామం గోపాల్‌‌ రావు పల్లెలో కోసా అంత్యక్రియలు

‘కడారి’కి కన్నీటి వీడ్కోలు ..స్వగ్రామం గోపాల్‌‌ రావు పల్లెలో కోసా అంత్యక్రియలు
  • హాజరైన ప్రజాసంఘాల నేతలు, సానుభూతిపరులు, గ్రామస్తులు

రాజన్న సిరిసిల్ల, వెలుగు : ఇటీవల ఎన్‌‌కౌంటర్‌‌లో చనిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్‌‌ కోసాకు కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు, గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. కడారి సత్యనారాయణరెడ్డి డెడ్‌‌బాడీ గురువారం ఉదయం స్వగ్రామమైన రాజన్నసిరిసిల్ల జిల్లా గోపాల్‌‌రావు పల్లెకు చేరుకుంది.

 ఆయన డెడ్‌‌బాడీని చూసిన కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు మాజీ ఎమ్మెల్సీ దేవీప్రసాద్, బీఆర్ఎస్, కాంగ్రెస్, పలువురు ప్రజా సంఘాల నాయకులు, గ్రామస్తులు హాజరై నివాళులర్పించారు.