మాక్స్ చనిపోయాడు.. బ్యాడ్ న్యూస్ షేర్ చేసిన శైలేష్

మాక్స్ చనిపోయాడు.. బ్యాడ్ న్యూస్ షేర్ చేసిన శైలేష్

హిట్(Hit) చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను(Shailesh kolanu) ఓ బ్యాడ్ న్యూస్ షేర్ చేశారు. ఆయన దర్శకత్వలో వచ్చిన ప్రీవియస్ మూవీ హిట్2(Hit2). అడివి శేష్(Adivi shesh), మీనాక్షి(Minakshi) జంటగా వచ్చిన ఈ మూవీ.. హిట్ సినిమాకు సీక్వెల్ గా వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టింది. ప్రేక్షకుల నుండి కూడా ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 

ALSOREAD:Layoffs : రెండు ఐటీ కంపెనీల నుంచి.. 500 మంది ఉద్యోగులు ఔట్

అయితే ఈ సినిమాలో  మరో ప్రత్యేక నటుడు కూడా ఆడియన్స్ ను మెప్పించాడు అతడే మాక్స్. హిట్ 2 సినిమాలో అడివి శేష్ పక్కన కనిపించిన ఈ పోలీస్ డాగ్ క్లిమక్స్ సీన్ లో అదరగొట్టేసింది. దీంతో చాలా మంది ప్రేక్షకులు మాక్స్(Max) తో కనెక్ట్ అయ్యారు. తాజాగా మాక్స్ గురించి ఒక బాధాకరమైన విషయాన్ని షేర్ చేశారు దర్శకుడు. అదేంటంటే.. మాక్స్ చనిపోయిందట. ఈ మేరకు మాక్స్ గురించి సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు శైలేష్.. బరువెక్కిన గుండెతో  ఈ వార్తను మీతో షేర్ చేసుకుంటున్నాను. మన ప్రియమైన మాక్స్ ఇప్పుడే చనిపోయాడు. గత కొంతకాలంగా మాక్స్‌ తీవ్రమైన టిక్ ఫీవర్‌తో బాధపడుతున్నాడు. క్రూరమైన జాతికి చెందినదే కానీ.. నా జీవితంలో నేను కలిసిన సున్నితమైన మనసుల్లో మాక్స్‌ ఒకటి. మాక్స్‌ లేకుండా #Hit2 సినిమా ఊహించుకోలేను. అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు శైలేష్. 

ఈ న్యూస్ చూసిన చాలామంది మాక్స్ మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. మీ మిస్ యూ మాక్స్ అంటూ కామెట్స్ చేస్తున్నారు.

With a shattered heart I bring this news to you guys. Our beloved Max just passed away. She was suffering for the last ten days with a severe tick fever and fought really hard. Despite being a ferocious breed, she is one of the most gentle souls I have ever met in my life. Thanks… pic.twitter.com/UF6o2TCK1k

— Sailesh Kolanu (@KolanuSailesh) July 13, 2023