Layoffs : రెండు ఐటీ కంపెనీల నుంచి.. 500 మంది ఉద్యోగులు ఔట్

 Layoffs : రెండు ఐటీ కంపెనీల నుంచి.. 500 మంది ఉద్యోగులు ఔట్

అనిశ్చితి, ఆర్థిక వ్యయం పేరుతో ఇప్పటికే పలు దిగ్గజ ఐటీ కంపెనీలు, స్టార్టప్ లు తమ ఉద్యోగులను తీసివేశాయి. ఇప్పుడు మరో రెండు కంపెనీలు లేఆఫ్స్ ను ప్రకటించడం ఉద్యోగుల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది. సచిల్ బన్సాల్ నవీ స్టార్టప్ తో పాటు అప్ స్కిల్లింగ్ ఎడ్టెక్ స్టార్టప్ స్కిల్-లింక్  తమ ఉద్యోగుల్లో కొందర్ని ఇంటికి పంపించేందుకు సిద్దమయ్యాయి.

బలహీనమైన మార్కెట్ పరిస్థితులను పేర్కొంటూ నవీ.. Navi సంవత్సరానికి రెండుసార్లు పనితీరు అంచనాలను నిర్వహిస్తుంది. దీని ఫలితంగా కంపెనీ నుంచి కొన్ని నిష్క్రమణలు జరుగుతాయి. అయినప్పటికీ, నవీ అనేక ఓపెన్ పొజిషన్‌లను కలిగి ఉంది. కంపెనీ ఈ సంవత్సరం చాలా మంది కొత్త ఉద్యోగులను నియమించుకోవడం కొనసాగించాలని భావిస్తోంది. ఇందులో 150+ క్యాంపస్ హైర్‌ల బ్యాచ్ ఆగస్టులో చేరనుంది అని నవీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంలోనే తమ కంపెనీలో పని చేస్తోన్న వారిలో 150-200 మంది ప్రొడక్షన్, అనలిటిక్స్ డిపార్ట్ మెంట్ లోని ఉద్యోగులను తొలగించినట్టు నివేదికలు సూచిస్తున్నాయి.

ALSOREAD:మాక్స్ చనిపోయాడు.. బ్యాడ్ న్యూస్ షేర్ చేసిన శైలేష్

ఇక ఎడ్టెక్ స్టార్టప్ స్కిల్-లింక్ విషయానికొస్తే.. దాదాపు 20% మంది ఉద్యోగులను తొలగించింది. దీని వల్ల దాదాపు 225 మంది ఉద్యోగులను ప్రభావితమైనట్టు తెలుస్తోంది. రెండవ రౌండ్ తొలగింపులను నిర్వహించిన ఈ కంపెనీ.. జూన్ 27న దీన్ని అమలుచేసింది. వ్యయాలను తగ్గించడానికి, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, ఫ్యూచర్ లో కంటెంట్ అండ్ ప్రొడక్షన్ ఇన్వెస్ట్మెంట్స్ ను పరిమితం చేయడానికి కంపెనీ ఈ లేఆఫ్స్ చేపట్టినట్టు సమాచారం.