
న్యూఢిల్లీ: ఈసారి ఐపీఎల్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నుంచి ప్రత్యర్థి జట్లకు ముప్పు తప్పదని ఆర్‌సీబీ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ హెచ్చరించాడు. కెప్టెన్సీ ఒత్తిడి లేకపోవడంతో అతను మరింత స్వేచ్ఛగా, దూకుడుగా ఆడే చాన్స్ ఉందన్నాడు. ‘కెప్టెన్సీ భారం లేదు కాబట్టి కోహ్లీ ముఖంలో ఇప్పుడు ఒత్తిడి కనిపించదు. ఇది ఓ రకంగా ఆశ్చర్యాన్ని కలిగించినా.. అవతలి టీమ్స్‌కు మాత్రం ఇవి ప్రమాద సంకేతాలే. విరాట్‌కు కెప్టెన్సీ బరువుగా మారిందని నా అభిప్రాయం. అందుకే వదిలేశాడనుకుంటున్నా. వేరే ఏ రకమైన ఒత్తిడి లేదు కాబట్టి రాబోయే కొన్నేళ్లు అతను కెరీర్‌ను చాలా ఆస్వాదిస్తాడు. స్టార్టింగ్‌లో ఎలా ఆడేవాడో అలాగే ఇప్పుడు ఆడతాడు’ అని మ్యాక్సీ చెప్పాడు.