వీడియో: వికాస్ దూబే కారు వెంట ఉన్న మీడియా కార్లను అందుకే ఆపారా?

వీడియో: వికాస్ దూబే కారు వెంట ఉన్న మీడియా కార్లను అందుకే ఆపారా?

గత శుక్రవారం ఎనిమిది మంది పోలీసులను చంపిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వికాస్ దూబేను గురువారం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహంకాళీ గుడిలో పోలీసులు అరెస్టు చేశారు. దూబేను శుక్రవారం తెల్లవారుజామును కాన్పూర్ తీసుకొస్తుండగా.. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఎన్‌కౌంటర్‌ చేయబడ్డాడు.

వికాస్ దూబే ప్రయాణిస్తున్న కారు బోల్తా పడటంతో.. కారులోని దూబే మరియు పోలీసులు గాయపడ్డారని యూపీ ఉన్నతాధికారులు అంటున్నారు. కారు బోల్తా పడటంతో దూబే.. గాయపడిన పోలీసు నుండి తుపాకీని లాక్కొని తప్పించుకోవడానికి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. పోలీసులు దూబేను చుట్టుముట్టి లొంగిపోవాలని కోరినా వినకుండా.. దూబే పోలీసులపై కాల్పులు జరిపాడని.. పోలీసుల ఎదురుకాల్పుల్లో దూబే మరణించాడని అధికారులు పేర్కొన్నారు.

అయితే దూబేను మధ్యప్రదేశ్ నుంచి కాన్పూర్ తీసుకెళ్తున్న కాన్వాయ్ ను మీడియా ప్రతినిధులు కార్లలో ఫాలో అయ్యారు. కాన్పూర్ కు దగ్గర్లోకి రాగానే.. సచేండి అనే ప్రాంతంలో పోలీసులు.. మీడియా కార్లను ఆపి వేసి.. వారు మాత్రమే వెళ్లిపోయారు. ఆ ఘటనతో వికాస్ దూబేను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయాలని ముందే అనుకున్నారా అనే అనుమానాన్ని కలిగిస్తుంది. అందుకే మీడియా వాళ్లను పోలీసుల కాన్వాయ్ తో రాకుండా అడ్డుకున్నారని తెలుస్తోంది.

తెల్లవారుజామున 4 గంటలకు టోల్ బూత్ దగ్గర దూబేను తీసుకెళ్తున్న మూడు కార్లు రికార్డయ్యాయి. అప్పుడు దూబే ఉన్న కారు.. హైవేపై ప్రమాదం జరిగిన కారు వేరువేరుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పోలీసులు ఇంకా స్పందించలేదు.

దూబే ఎన్‌కౌంటర్‌ జరగడానికి అరగంట ముందు ఉదయం 6:30 గంటలకు తీసిన ఒక వీడియోలో.. పోలీసులు ముందుకెళ్లి, మీడియా కార్లను ఆపివేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. దూబే తరపు న్యాయవాది గురువారం రాత్రి సుప్రీంకోర్టులో దూబే రక్షణ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై కోర్టు స్పందించక ముందే దూబే ఎన్‌కౌంటర్‌ కు గురయ్యాడు.

దూబే కారు బోల్తా పడిన ప్రాంతంలో తుపాకీ కాల్పులు విన్నట్లు అక్కడి ప్రాంతం వారు తెలిపారు. ‘మేం ఇక్కడ తుపాకీ కాల్పుల శబ్దం విన్న తర్వాత ఏం జరిగిందో చూద్దామని వచ్చాం. పోలీసులు మమ్మల్ని అక్కడి నుంచి వెళ్లగొట్టారు. దాంతో మేం ఇంటికి వెళ్లిపోయాం’ అని ఆశిష్  పాశ్వాన్ అనే వ్యక్తి తెలిపాడు.

For More News..

తెలంగాణ సెక్రటేరియట్ కూల్చివేతకు బ్రేక్

పోలీసుల అదుపులో దూబే భార్య, కొడుకు

కరోనా పేషంట్ బతికుండగానే చనిపోయాడంటూ..

ప్రభుత్వంలో 10 వేల మంది ఉద్యోగాలు ఊస్ట్