
ముంబై: ఇండియా టెస్టు టీమ్‌లోకి తిరిగి రావాలని ఆశించిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌కు టీమ్ మేనేజ్‌మెంట్ మొండిచేయి చూపించింది. గాయపడ్డ లోకేశ్ రాహుల్ స్థానంలో మయాంక్‌ను ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టులో పోటీ పడే టీమ్‌లోకి తీసుకునేందుకు నిరాకరించింది. ఇప్పటికే జట్టుతో ఉన్న శుభ్‌మన్ గిల్ రూపంలో ఓపెనర్ అందుబాటులో ఉండటంతో మరో ప్లేయర్‌ను చేర్చాల్సిన అవసరం లేదని నిర్ణయించింది. హెచ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ సోమవారం లండన్ బయల్దేరుతారు.