సుఖేష్ గుప్తా మోసాలకు పాల్పడ్డాడు

సుఖేష్ గుప్తా మోసాలకు పాల్పడ్డాడు

MBS జువెల్స్ కేసులో సోదాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ క్లారిటీ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఐదు ప్రదేశాల్లో సోదాలు చేసి 149 కోట్ల 10లక్షల విలువైన బంగారం, కోటి 96లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటనలో తెలిపింది. MMTC కుంభకోణం కేసులో ఇప్పటికే సుఖేష్ గుప్తాను ఈడీ అరెస్ట్ చేసింది. MMTC బయర్స్ క్రెడిట్ స్కీమ్ కింద బంగారం తీసుకుని మోసాలకు పాల్పడినట్లు తెలిపింది. 

MMTCకి 504 కోట్ల ప్రజాధనానికి నష్టం జరిగినట్లు సోదాల్లో ఈడీ అధికారులు గుర్తించారు. సుఖేష్ గుప్తా తీసుకున్న రుణంపై MMTCతో OTS ఒప్పందం చేసుకున్నారని.. ఆ తర్వాత ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించినట్లు నోట్ లో తెలిపారు. MMTC సంస్థలో పనిచేస్తున్న అధికారులతో ముఖేష్ గుప్తా కుమ్మక్కయి మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. బంగారాన్ని అమ్మగా వచ్చిన నగదును సొంత ఖాతాలకు సుఖేష్ గుప్తా బదిలీ చేసినట్లు తెలిపారు. ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్లు చెల్లించకుండా బంగారాన్ని తీసుకుని మోసాలకు పాల్పడినట్లు ప్రకటనలో తెలిపారు.