యూస్‌లో మెక్ డోనాల్డ్స్ ఆఫీసులు మూసివేత

యూస్‌లో మెక్ డోనాల్డ్స్ ఆఫీసులు మూసివేత

ఫాస్ట్ ఫుడ్ ను డెలివరీ చేసే ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ కంపెనీలలో ఒకటైన మెక్ డోనాల్డ్స్.. యూఎస్ లోని ఆఫీసులన్నింటినీ తాత్కాలికంగా మూసివేసింది. గత వారం రోజుల క్రితమే తమ ఉద్యోగులకు సోమవారం నుంచి బుధవారం వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించనున్నట్టు మెక్ డోనాల్డ్స్ స్టాఫ్ అందరికీ మెయిల్ పంపింది. త్వరలోనే వర్చ్యువల్ గా ఉద్యోగులను తీసివేయనున్నట్టు కూడా మెక్ డోనాల్డ్స్ ప్రకటించనుందని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఎంతమంది ఉద్యోగులపై కోత వేయనుందన్న విషయంపై మాత్రం ఈ కంపెనీ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. ఈ వారంలో షెడ్యూల్ చేయబడిన అన్ని వ్యక్తిగత సమావేశాలను రద్దు చేయాలని కూడా మెక్ డోనాల్డ్స్ ఉద్యోగులను కోరింది. అయితే ఏప్రిల్ 5 నాటికి ఉద్యోగుల తొలగింపు ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు వాల్ స్ట్రీట్ అంచనా వేసింది.

ప్రపంచ ఆర్థిక మాంద్యం,పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి ఐటీ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా ఉద్యోగ కోతలు విధిస్తున్నాయి. ఇప్పటికే గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్‌తో సహా అనేక టెక్ దిగ్గజాలు ఇటీవల తమ కార్యకలాపాలను భారీగా తగ్గించుకున్నాయి. యుఎస్ టెక్ కంపెనీలలో భారీ తొలగింపుల వల్ల తీవ్రంగా నష్టపోయిన వారిలో భారతీయులే ఎక్కువగా ఉన్నారు. దీంతో తాత్కాలిక వీసాలపై యూఎస్‌లో నివసిస్తోన్న వందలాది మంది ఉద్యోగులకు ఉపాధి లేకుండా పోయింది. నిరుద్యోగులుగా మారిన హెచ్1బీ వీసా హోల్డర్లు ఉద్యోగం లేకుండా చట్టబద్ధంగా 60 రోజులు మాత్రమే యూఎస్ లో ఉండగలరు.