లైంగిక వేధింపుల నివారణకు చర్యలు తీసుకోవాలి ..జడ్జి వెంకటేశ్‌‌

లైంగిక వేధింపుల నివారణకు చర్యలు తీసుకోవాలి ..జడ్జి వెంకటేశ్‌‌

కరీంనగర్ టౌన్, వెలుగు: చిన్నపిల్లలపై పెరుగుతున్న  లైంగిక  వేధింపులను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను జిల్లా మొదటి అదనపు  జడ్జి  డి.వెంకటేశ్‌‌ ఆదేశించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో పోక్సో కేసులపై  బుధవారం సిటీలోని జిల్లా న్యాయసేవా భవన్ లో రివ్యూ మీటింగ్‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌‌ కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. వెంకటేశ్‌‌, జూనియర్ సివిల్ జడ్జి, జువైనల్ జస్టిస్ బోర్డు చైర్‌‌‌‌పర్సన్ డి. ప్రీతి, డీసీపీవో పర్వీన్, సీడబ్ల్యూవో ధనలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.