
- మెదక్ జిల్లా శివ్వంపేటలో ఘటన
శివ్వంపేట, వెలుగు: దంపతుల మధ్య జరిగిన గొడవలో కూతురు మృతిచెందిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మండల కేంద్రమైన శివ్వంపేటకు చెందిన కుంట మహి, లావణ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
వారం రోజుల కింద కుటుంబ విషయంలో దంపతులు గొడవ పడుతుండగా లావణ్య చేతిలో ఉన్న చిన్న కూతురు ఆకాంక్ష(11 నెలలు) కింద పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. వెంటనే హైదరాబాద్ లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.