బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లోకి మెదక్‌‌‌‌ డీసీసీ ప్రెసిడెంట్‌‌‌‌ తిరుపతిరెడ్డి

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లోకి మెదక్‌‌‌‌ డీసీసీ ప్రెసిడెంట్‌‌‌‌ తిరుపతిరెడ్డి
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: మెదక్ డీసీసీ ప్రెసిడెంట్‌‌‌‌ తిరుపతిరెడ్డి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌‌‌‌, మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌ ఆయనకు శుక్రవారం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ, కాంగ్రెస్ కోసం కష్టపడిన తిరుపతిరెడ్డి లాంటి నాయకులను, ఆ పార్టీ లీడర్లు బలవంతంగా బయటకి పంపిస్తున్నారని ఆరోపించారు. తాము అలా చేయబోమని, తిరుపతి రెడ్డి సహా పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని కాపాడుకుంటామని చెప్పారు. తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, తనకు టికెట్ ఇస్తామని చెప్పి, ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు.

ప్రజలతో మమేకమైన నాయకులకు కాకుండా డబ్బు సంచులతో వచ్చిన పారాచ్యూట్ లీడర్లకి మాత్రమే కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తోందని ఆరోపించారు. అందుకే ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేసేందుకు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరుతున్నానని చెప్పారు. మెదక్ జిల్లాలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరుతున్నారని తెలిపారు. మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పారు.