అంగన్​వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి : డీడబ్ల్యూవో హైమావతి

అంగన్​వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి : డీడబ్ల్యూవో  హైమావతి

మెదక్​టౌన్, వెలుగు: జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్​వాడీల సేవలను చిన్నారులు, గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని డీడబ్ల్యూవో  హైమావతి సూచించారు. బుధవారం మెదక్​ పట్టణంలోని బోయిగల్లి, పిట్లంబేస్​ అంగన్​వాడీ కేంద్రాలను సూపర్​వైజర్​జయంతితో కలిసి తనిఖీ చేశారు.

 ఈ సందర్భంగా అంగన్​వాడీ కేంద్రాల్లో అందుతున్న సేవల గురించి ఆరాతీశారు. పదో తరగతి పాసైన స్టూడెంట్స్​చదువుకు ఫుల్​స్టాప్​పెట్టకుండా ఇంటర్​చేరేలా అంగన్​వాడీ టీచర్లు అవగాహన కల్పించాలన్నారు. వారి తల్లిదండ్రులకు చదువు ప్రాధాన్యం గురించి వివరించాలన్నారు. ఆమె వెంట టీచర్లు తేజమణి, స్మరణ ఉన్నారు.