మెదక్టౌన్, వెలుగు: కుమారుడు వేధిస్తున్నాడని మెదక్ పట్టణానికి చెందిన ఓ వృద్ధురాలు సోమవారం ఎస్పీ డీవీ శ్రీనివాస రావుకు ఫిర్యాదు చేశారు. ఆటోలో వచ్చిన బాధితురాలి వద్దకు ఎస్పీ వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు. కారుణ్య నియామకం ద్వారా కొడుకుకు ఉద్యోగం ఇప్పించిన తర్వాత తనను పట్టించుకోవడంలేదని వృద్ధురాలు వాపోయింది.
క్యాన్సర్తో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలి సమస్యను అడిగి తెలుసుకున్నారు. టౌన్ సీఐ మహేశ్ ను పిలిపించి, వృద్ధురాలి ఫిర్యాదుపై వెంటనే విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
