గవర్నర్‌‌తో మెదక్‌ ఎమ్మెల్యే భేటీ

గవర్నర్‌‌తో మెదక్‌ ఎమ్మెల్యే భేటీ

మెదక్, వెలుగు : గవర్నర్‌‌ తమిళిసైను మెదక్‌ ఎమ్మెల్యే డాక్టర్​ మైనంపల్లి రోహిత్ రావ్​ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.  గవర్నర్​ మాట్లాడుతూ..   డాక్టర్​కోర్సు చదివి ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి రావడం అభినందనీయమన్నారు. మైనంపల్లి సోషల్​సర్వీస్​ ఆర్గనైజేషన్​ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలుసుకుని గవర్నర్‌‌ ఎమ్మెల్యే రోహిత్​ను అభినందించారు.