- మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
మెదక్ టౌన్, వెలుగు: జిల్లాలో పెట్రోల్, డీజిల్‌ను డబ్బాలు, ప్లాస్టిక్ కంటైనర్లు, బాటిళ్లలో పోయడాన్ని పూర్తిగా నిషేధించాలని మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాసరావు బంక్ యజమానులకు సూచించారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఇంధనాన్ని డబ్బాలలో నిల్వ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు.
ప్రజల భద్రత దృష్ట్యా పెట్రోల్, డీజిల్‌ను ఇంట్లో, ఇతర ప్రదేశాల్లో నిల్వ చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. మెదక్ పట్టణం, చిన్నశంకరంపేటలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న రెండు పెట్రోల్ బంకులను నెలరోజుల్లో ప్రారంభిస్తామని ఎస్పీ తెలిపారు.
