2,500 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యం : మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్

2,500 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యం : మెదక్  కలెక్టర్ ప్రతిమాసింగ్

నిజాంపేట, వెలుగు: రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి  సాధించాలని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ రైతులకు సూచించారు. మంగళ వారం నిజాంపేట్ మండలం చెల్మెడ గ్రామంలోని ఆయిల్ ఫామ్ నర్సరీని హార్టికల్చర్, అగ్రికల్చర్ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 2,500 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 

ఇందుకు అనుగుణంగా పకడ్బందీగా ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు.  ఇక్కడ ఉన్న ఆయిల్ ఫామ్ నర్సరీ లో మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా దేశాలనుంచి విత్తనాలు తెప్పించి, మొక్కలుగా ఏదిగాక రైతులకు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్, ఎంపీడీవో రాజిరెడ్డి పాల్గొన్నారు.