మేడారం ఉత్సవ కమిటీ ప్రమాణ స్వీకారం

మేడారం ఉత్సవ కమిటీ ప్రమాణ స్వీకారం

 తాడ్వాయి, వెలుగు: మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతల మహా జాతర ఈనెల 21 నుంచి 24 వరకు జరగనున్న నేపథ్యంలో జాతర ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. చైర్మన్ గా అరేం లచ్చు పటేల్, డైరెక్టర్లుగా మిల్కూరి ఐలయ్య, కోడి గోపాల్, కోరం అబ్బయ్య, పోరిక నారాయణ సింగ్, గంగెల్లి రాజారత్నం, అల్లం శశిధర్, కొంపల్లి శ్రీనివాసరెడ్డి, చామర్తి కిశోర్, యాప అశోక్, వద్దిరాజు రవిచంద్ర, ముంజాల బిక్షపతి, అంకం కృష్ణస్వామి, చుంచా హైమావతి, ఎక్స్అఫిషియో మెంబర్ గా సిద్దబోయిన జగ్గారావును నియమించారు. ఈ కమిటీ గురువారం మేడారంలోని సమ్మక్క భవనంలో ప్రమాణ స్వీకారం చేసింది. 

దీనికి పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం రేవంత్​రెడ్డి జాతర కోసం రూ.110 కోట్లను మంజూరు చేశారని, ఒకవేళ నిధులు మిగిలితే శాశ్వత పనులకు ఖర్చు పెడతామన్నారు. చైర్మన్​లచ్చుపటేల్​మాట్లాడుతూ అందరం కలిసి జాతర సక్సెస్​చేయడానికి కృషి చేస్తామన్నారు. ఎండోమెంట్ ఈవో రాజేంద్ర, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా మహిళా అధ్యక్షురాలు రేగ కళ్యాణి  పాల్గొన్నారు.

ప్లాస్టిక్ ఫ్రీ జాతరగా నిర్వహించాలి

మేడారం జాతరను ప్లాస్టిక్ ఫ్రీగా నిర్వహించాలని మంత్రి సీతక్క అన్నారు. మేడారం హరిత హోటల్​లో కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య నిర్వహణ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ పారిశుద్ధ్యం విషయంలో అధికారులు అలర్ట్​గా ఉండాలన్నారు. పంచాయితీరాజ్ కమిషనర్ అనిత రామచంద్రన్, కలెక్టర్ ఇలా త్రిపాఠి,  ఎస్పీ శబరీశ్​పాల్గొన్నారు.