రూ.12 కోట్లు దాటిన మేడారం జాతర ఆదాయం

రూ.12 కోట్లు దాటిన మేడారం జాతర ఆదాయం
  • 800 గ్రాముల బంగారం 55 కిలోల వెండి సమర్పించిన భక్తులు 
  • నేటితో ముగియనున్న హుండీల లెక్కింపు 
  • గత జాతరలో వచ్చింది రూ.11 కోట్ల 45 లక్షలు 

వరంగల్, వెలుగు: మేడారం మహా జాతర హుండీల కానుకల ఆదాయం మొదటిసారిగా రూ.12 కోట్లు దాటింది. గత జాతర కంటే ఇప్పటికే రూ. కోటి 26 లక్షల ఆదాయం ఎక్కువగా వచ్చింది. ఇప్పటివరకు ఆరు రోజుల పాటు లెక్కింపు జరపగా 540 హుండీలను తెరిచారు. బుధవారంతో కౌంటింగ్‍ ముగియనుంది. గత జాతరలో లెక్కింపు కోసం రెండు వారాల సమయం తీసుకోగా ఈసారి వారంలోనే ముగుస్తోంది. 2022 జాతరలో మొత్తం హుండీల కరెన్సీ ఆదాయం రూ.11,45,34, 526 కాగా, ఈసారి మంగళవారం నాటికి రూ.12 కోట్ల 71 లక్షల 79 వేల 280 నగదు వచ్చింది.

ఆరోరోజైన మంగళవారం మిగిలిన 59 హుండీలు ఓపెన్‍ చేయగా..రూ.కోటి 46 లక్షల 9 వేలు వచ్చాయి. గత జాతరలో బంగారం 631 గ్రాములు రాగా..ఇప్పుడు 800 గ్రాములు వచ్చింది. గత జాతరలో వెండి 48 కిలోల 350 గ్రాములు రాగా..ఈసారి 55 కిలోల 150 గ్రాములు వచ్చింది. వచ్చిన ఆదాయాన్ని డిపార్ట్​మెంట్​బ్యాంక్ అకౌంట్లో జమ చేసినట్లు అసిస్టెంట్‍ కమిషనర్‍ రామల సునీత, మేడారం ఈవో రాజేంద్రం  తెలిపారు.