మేడారం జాతరకు పోటెత్తుతున్న భక్తులు

మేడారం జాతరకు పోటెత్తుతున్న భక్తులు

ములుగు జిల్లా: మేడారం సమ్మక- సారాలమ్మ జాతరకు భక్తులు ముందస్తుగా  పోటెత్తారు. కరోనా కేసులు ఉద్ధృతంగా పెరుగుతుండడంతో చాలా మంది భక్తులు ముందుగానే అమ్మవార్ల దర్శనానికి తరలివస్తున్నారు. దీంతో జాతర ప్రాంగణం కిక్కిరిసి పోయింది. ఇవ్వాళ ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు మేడారం చేరుకొని గంటల తరబడి క్యూలో తల్లులను దర్శించుకుంటున్నారు. కుటుంబ సమేతంగా పసుపు, కుంకుమలతో వన దేవతలకు పూజలు చేసి బంగారాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకుని చల్లంగా చూడు తల్లీ అంటూ  వేడుకుంటున్నారు.
 

ఇవి కూడా చదవండి

ఫిబ్రవరి మొదటివారంలోగా దళితబంధు లబ్దిదారుల ఎంపిక

దేశంలోని అత్యంత ఖరీదైన ఇల్లు ముఖేష్ అంబానీది

కోహ్లీ గొప్ప క్రికెటర్..బలవంతంగా కెప్టెన్సీ నుంచి తప్పించారు