
తాడ్వాయి, వెలుగు: మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల జాతరలో భాగంగా కేశఖండన, వాహనపూజ రేట్లు పెంచుతున్నట్లు ఈవో కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. కేశఖండన టికెట్‌ను రూ.10 నుంచి రూ.50, టూ వీలర్ కు రూ.100, ఆటోకు రూ.150, కారు, లారీ, బస్సు, ఇతర భారీ వాహనాలకు రూ.200 రేటు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రేట్ల పెంపుపై భక్తులు 15 రోజుల లోపు ఈవో ఆఫీస్‌లో తమ నిర్ణయాలు రాత పూర్వకంగా తెలియజేయాలని సూచించారు.