మద్యం, డబ్బుల కోసం వేధిస్తున్నాడని.. కన్న కొడుకును చంపిన తండ్రి

మద్యం, డబ్బుల కోసం వేధిస్తున్నాడని.. కన్న కొడుకును చంపిన తండ్రి

రోజురోజుకు మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి..  మద్యం, డబ్బుల కోసం వేధిస్తున్నాడని కన్న కొడుకుని తండ్రి హత్య చేశాడు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

శామీర్ పేట మండలంలోని లాల్ గడి మలక్ పేట్ గ్రామంలో రామ్ చందర్, మంజుల కొడుకు కొరివి నరేష్(28) వృత్తిరీత్యా డ్రైవర్ గా పనిచేస్తూ.. జీవనం సాగిస్తున్నారు. అయితే కొరివి నరేష్ ఫిబ్రవరి 11వ తేదీ నుంచి కనిపించడం లేదని.. ఫిబ్రవరి 22వ తేదీన తల్లి మంజుల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. తన కొడుకు నరేష్ ను తండ్రి రామచందర్ హత్య చేశాడని నిర్ధారణలో తేలింది.

మద్యానికి బానిసై.. నిత్యం డబ్బుల కోసం నిత్యం వేధిస్తున్నాడని.. కోపంతో ఓ ప్లాన్ చేశాడు నరేష్ తండ్రి. మద్యం తాగుదాం అని చెప్పి.. ఆ తర్వాత రూ. 10 వేలు ఇస్తానని గ్రామ సమీపంలో ఉన్న ఓ బావి దగ్గరికి కొడుకు నరేష్ ను తీసుకెళ్లాడు తండ్రి రామ్ చందర్. నరేష్ కు ఫుల్ గా మద్యం తాగించిన అనంతరం.. బావిలో తోసేశానని చెప్పాడు రామ్ చందర్. ఈ విషయం పోలీసుల విచారణలో బయపడింది. తన కొడుకుని తానే హత్య చేసినట్లు రామ్ చందర్ చెప్పాడని పోలీసులు వెల్లడించారు. మృతుడు నరేష్ కి భార్య, సంవత్సరంన్నర బాబు ఉన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.