వికారాబాద్ కలెక్టరేట్ లో మీడియా సెంటర్..పంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు

వికారాబాద్ కలెక్టరేట్ లో మీడియా సెంటర్..పంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు

వికారాబాద్, వెలుగు: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గురువారం వికారాబాద్ కలెక్టరేట్​లో మీడియా సెంటర్ ను కలెక్టర్ ప్రతీక్ జైన్, జనరల్ అబ్సర్వర్ షేక్ యాస్మిన్ బాషాతో కలిసి ప్రారంభించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు లో భాగంగా మీడియా సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారంపై  మీడియా సెంటర్ ద్వారా  నిఘా పెట్టడం జరుగుతుందన్నారు.