లైసెన్స్​డ్ ఆయుధాలు డిపాజిట్ చేయాలి : కలెక్టర్ శరత్

లైసెన్స్​డ్ ఆయుధాలు డిపాజిట్ చేయాలి : కలెక్టర్ శరత్

సంగారెడ్డి టౌన్ , వెలుగు : జాతీయ ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ శరత్ వెల్లడించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ, అదనపు కలెక్టర్ల తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నేపథ్యంలో లైసెన్స్ ఆయుధాలు కలిగిన వారు స్థానిక పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయాలని స్పష్టం చేశారు.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కొత్త అకౌంటును ఓపెన్​ చేసి ఎన్నికల ఖర్చు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో 379 సమస్య ఆత్మక కేంద్రాలను గుర్తించామని 18 మోడల్ ఆఫీసర్స్ ద్వారా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మాధురి ,చంద్రశేఖర్, డీఆర్ఓ నగేశ్​పాల్గొన్నారు.

బాధ్యతగా విధులు నిర్వహించాలి

ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు తమ విధులను బాధ్యతగా నిర్వర్తించాలని కలెక్టర్ శరత్ అన్నారు.  కలెక్టరేట్ లో ఎస్పీ రమణ కుమార్ తో కలిసి  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్టోరియల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దారులు, ఆయా కమిటీల నోడల్ అధికారులు, పోలీస్ అధికారులతో ఎన్నికల షెడ్యూల్, నిర్వహణ, బాధ్యతల గురించి చర్చించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ ముగిసేంత వరకు ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం విధులు నిర్వహించవలసి ఉంటుందన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.