మేడిగడ్డ కుంగినా చెక్కుచెదరని యాగశాల!

మేడిగడ్డ కుంగినా చెక్కుచెదరని యాగశాల!

కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కట్టిన మూడేండ్లకే కుంగిన సంగతి తెలిసిందే. కానీ, ఈ బ్యారేజీ ప్రారంభానికి ముందు కాళేశ్వరం క్షేమాన్ని కాంక్షిస్తూ అప్పటి సీఎం కేసీఆర్​ గోదావరి ఒడ్డున టెంపరరీ రేకులతో యాగశాల నిర్మించి యజ్ఞం చేశారు. 2022 జులైలో గోదావరికి వచ్చిన భారీ వరదలకు ఈ యాగశాల సగానికి పైగా నీటమునిగినా  చెక్కు చెదరలేదు. కానీ, వేల కోట్లు పెట్టి కట్టిన మేడిగడ్డ బ్యారేజీ మాత్రం నెర్రెలుబారింది. బ్యారేజీ చూసేందుకు వచ్చిన వాళ్లంతా ఇప్పుడు ఇదే విషయం చర్చించుకుంటున్నారు. వేల కోట్లు పెట్టి కట్టిన కాంక్రీట్ ​కట్టడం కంటే ​రేకుల షెడ్డే బెటర్​గా ఉందని మాట్లాడుకుంటున్నారు.