V6 News

కూతురు పేరుతో తండ్రికే అశ్లీల సందేశాలు

కూతురు పేరుతో తండ్రికే అశ్లీల సందేశాలు
  • సైబర్ కిరాతకుల నీచ చేష్టలు!

మేడిపల్లి, వెలుగు: సోషల్ మీడియాలో సైబర్ నేరగాళ్లు ఎంతటి నీచానికి ఒడిగడుతున్నారో చెప్పే ఉదంతమిది. తన కన్నకూతురి పేరుతోనే నకిలీ ఖాతా సృష్టించి ఓ తండ్రిని వేధిస్తున్న ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. కాచవానిసింగారం దివ్యానగర్​కు చెందిన ఓ వ్యక్తి కుమార్తె పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ ఇన్​స్టాగ్రామ్ ఐడీని క్రియేట్ చేశారు.

ఆ అకౌంట్ నుంచి బాధితుడికి అశ్లీల చిత్రాలు, సందేశాలు పంపి వేధింపులకు గురిచేయడమే కాకుండా.. బాధితుడి బంధుమిత్రులకు కూడా వాటిని పంపి పరువు తీస్తున్నారు. ఈ మానసిక వేధింపులపై బాధితుడు ఫిర్యాదు చేయగా, డిటెక్టివ్ ఇన్​స్పెక్టర్ ఎన్. ఎలక్షన్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.