మెడ్‌‌‌‌ప్లస్‌‌‌‌ షేర్లకు నోమురా బై రేటింగ్‌‌‌‌.. టార్గెట్‌‌‌‌ ధర రూ.974

మెడ్‌‌‌‌ప్లస్‌‌‌‌ షేర్లకు నోమురా బై రేటింగ్‌‌‌‌.. టార్గెట్‌‌‌‌ ధర రూ.974

న్యూఢిల్లీ :  మెడ్‌‌‌‌ప్లస్‌‌‌‌ హెల్త్‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌పై నోమురా హోల్డింగ్స్ పాజిటివ్‌‌‌‌గా ఉంది.  జనరిక్ మెడిసిన్స్ లాంచ్ చేయడంతో కంపెనీకి మీడియం టెర్మ్‌‌‌‌లో సేల్స్ పెరుగుతాయని తెలిపింది. ప్రైవేట్ లేబుల్స్‌‌‌‌  సెగ్మెంట్‌‌‌‌లో వచ్చిన నష్టాలను భర్తీ చేస్తుందని వెల్లడించింది. మెడ్‌‌‌‌ప్లస్ షేరుకు నోమురా ‘బై’ రేటింగ్ ఇచ్చింది. టార్గెట్ ధరను  రూ.952 నుంచి  రూ.974 కి పెంచింది. కంపెనీ షేర్లు సోమవారం రూ.748 దగ్గర క్లోజయ్యాయి.  కాగా, జనరిక్ మెడిసిన్స్‌‌‌‌ను  60 నుంచి 80 శాతం  డిస్కౌంట్‌‌‌‌కు ఈ ఏడాది జూన్‌‌‌‌లో మెడ్‌‌‌‌ప్లస్ లాంచ్ చేసింది.

ప్రైవేట్‌‌‌‌ కంపెనీలతో టై అప్ అయ్యి, ఈ మెడిసిన్స్‌‌‌‌ తయారు చేస్తోంది. వీటిని తమ స్టోర్లలో డిస్కౌంట్‌‌‌‌కు అమ్ముతోంది.  మెడ్‌‌‌‌ప్లస్‌‌‌‌ సబ్‌‌‌‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొచ్చిందని, ఈ ప్లాన్ తీసుకున్నవారికి భారీ డిస్కౌంట్‌‌‌‌కు మందులు అమ్ముతోందని నోమురా వెల్లడించింది. తక్కువలో తక్కువ యాన్యువల్ సబ్‌‌‌‌స్క్రిప్షన్ ఫీజు రూ.49 గా ఉందని తెలిపింది. వాల్యూమ్స్ పెరుగుతాయని, క్యాష్‌‌‌‌ ఫ్లో సానుకూలంగా ఉంటుందని అంచనా వేసింది. జనరిక్ లాంచ్ సక్సెస్ అయితే  షేరు అదనంగా రూ.300 పెరుగుతుందని నోమురా తెలిపింది. మెడ్‌‌‌‌ప్లస్ తాజాగా డయాగ్నోస్టిక్స్ బిజినెస్‌‌‌‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 2027 నాటికి ఈ బిజినెస్‌‌‌‌ ఇబిటా 20 శాతం పెరుగుతుందని వెల్లడించింది.