Meena: డబ్బు కోసం ఇంతలా దిగజారాలా.. రెండో పెళ్లి వార్తలపై మీనా ఫైర్

Meena: డబ్బు కోసం ఇంతలా దిగజారాలా.. రెండో పెళ్లి వార్తలపై మీనా ఫైర్

సీనియర్ హీరోయిన్ మీనా(Meena) సోషల్ మీడియా వార్తలపై ఫైర్ అయ్యారు. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారా అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తనలా చాలా మంది ఒంటరి ఆడవాళ్ళు ఉన్నారని దయచేసి వారి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి అంటూ మంది పడ్డారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. కొద్దిరోజుల క్రితం మీనా భర్త అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇక అప్పటినుండి ఆమె రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. 

ఇప్పటికే పలుమార్లు ఈవార్తలపై క్లారిటీ ఇచ్చారు మీనా. అయినప్పటికీ ఆ వార్తలు ఆగకపోవడంతో తాజాగా స్పందించారు ఆమె. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనా సోషల్ మీడియాలో వార్తలపై ఘాటుగా స్పందించారు.. ఈ మధ్య సోషల్ మీడియాలో డబ్బుల కోసం ఎవరి ఇష్టంవచ్చినట్లు వారు రాస్తున్నారు. రోజురోజుకి మీడియా దిగజారిపోతోంది. నిజాలు తెలుసుకొని రాస్తే అందరికీ మంచిది. ఈ దేశంలో నాలా భర్తని కోల్పోయిన ఆడవాళ్లు చాలా మంది ఉన్నారు. దయచేసి వాళ్ళ గురించి కూడా అలా రాయకండి.

ప్రస్తుతం నాకు రెండో పెళ్లిపై ఆలోచన లేదు. నా తల్లిదండ్రులు, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి ఇప్పుడెలా చెప్పగలను. ఒకవేళ రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే నేనే స్వయంగా ప్రకటిస్తాను.. అంటూ చెప్పుకొచ్చారు మీనా. ప్రస్తుతం మీనా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.