NC24: సైంటిస్ట్గా మీనాక్షి చౌదరి.. నాగచైతన్య మైథికల్ థ్రిల్లర్లో ఇంట్రెస్టింగ్ లుక్

NC24: సైంటిస్ట్గా మీనాక్షి చౌదరి.. నాగచైతన్య మైథికల్ థ్రిల్లర్లో ఇంట్రెస్టింగ్ లుక్

టాలీవుడ్ క్రేజీయెస్ట్ హీరోయిన్ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhari) వరుస సినిమాలతో బిజీగా ఉంది. అతి తక్కువ కాలంలోనే తెలుగులో మీనాక్షి చౌదరి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇటీవలే, లక్కీభాస్కర్, సంక్రాంతి వస్తున్నాం సినిమాలతో మంచి సక్సెస్ సాధించింది. ఈ క్రమంలో ఎంతోమంది ఆడియన్స్ను తన ఫాలోవర్స్ లిస్ట్లో చేర్చుకుంది. ఇలా తనం సక్సెస్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం వినూత్న రోల్లో కనిపించడానికి సిద్ధమైంది. ఆ వివరాల్లోకి వెళితే..

బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్‌‌‌‌తో ఫుల్ జోష్‌‌‌‌లో ఉన్నారు నాగ చైతన్య మరియు మీనాక్షి చౌదరి. వీరిద్దరూ కలిసి ఓ మైథికల్ థ్రిల్లర్లో నటిస్తున్నారు. ‘విరూపాక్ష’ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న (NC 24) మూవీలో మీనాక్షి నెవెర్ బిఫోర్ క్యారెక్టర్ చేస్తుంది. 

లేటెస్ట్గా ఇవాళ మంగళవారం (2025 నవంబర్ 4న) మీనాక్షి క్యారెక్టర్ రివీల్ చేస్తూ, పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. మైథికల్ థ్రిల్లర్ అంశాలతో ముడిపడిన ఈ మిస్టిక్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌లో మీనాక్షి‘దక్ష’ అనే ఆర్కియాలజిస్ట్‌‌‌‌ సైంటిస్ట్గా కనిపించనుంది. ఆమె పాత్ర సినిమాకు చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సందర్భంగా రహస్యం యొక్క లోతుల్లో, ఆమె సత్యాన్ని వెలికితీస్తుందని మేకర్స్ క్యాప్షన్ ఇచ్చారు.

‘‘మా NC24 నుండి మీనాక్షి చౌదరిని మీ అందరికీ 'దక్ష'గా పరిచయం చేస్తున్నాము. రహస్యం యొక్క లోతుల్లో, ఆమె సత్యాన్ని వెలికితీస్తుంది. ఈ నవంబర్ NC24 నుండి మరిన్ని అప్‌డేట్‌లు రానున్నాయి’’ అని మేకర్స్ తెలిపారు.

మీనాక్షి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం 'అనగనగ ఒక రాజు' చిత్రంలో నవీన్ పొలిశెట్టికి జంటగా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2026 సంక్రాంతికి రిలీజ  కానుంది. మరోవైపు చిరంజీవి 'విశ్వంభర' చిత్రంలో మీనాక్షి గెస్ట్ రోల్లో కనిపించనుంది. అలాగే పలు క్రేజీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది బ్యూటీ. 

ఇకపోతే, ఈ మూవీలో నిధి అన్వేషకుడిగా నాగ చైతన్య కనిపించనున్నాడు. తన పాత్ర కోసం ఫిజికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, మెంటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కంప్లీట్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్ అయ్యాడు. ‘తండేల్’ సక్సెస్ తర్వాత నాగ చైతన్య నటిస్తున్న చిత్రమిది. ఈ క్రమంలో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే కథ, కథనాలను సెట్ చేశాడు డైరెక్టర్ కార్తీక్. ఇందులో హిందీ మూవీ ‘లాపతా లేడీస్‌‌‌‌’ఫేమ్ స్పర్ష్‌‌‌‌ శ్రీవాత్సవ విలన్‌‌‌‌గా నటిస్తున్నాడు.

టెక్నీకల్ టీమ్ విషయానికి వస్తే.. దర్శకుడు కార్తీక్ దండు గత చిత్రం ‘విరూపాక్ష’ తరహాలో ‘వృషకర్మ’ (కార్యసాధకుడు) అనే  వైవిధ్యమైన టైటిల్‌‌‌‌ను పరిశీలిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ బి లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్ సంగీతం, నీల్ డి కున్హా డీవోపీగా, నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, నవీన్ నూలి ఎడిటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వర్క్ చేస్తున్నారు. SVCC, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై బీవీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు.