మీర్జాపూర్ పోలీస్ దొర : పిల్లలతో మసాజ్

మీర్జాపూర్ పోలీస్ దొర : పిల్లలతో మసాజ్

పోలీసు స్టేషన్‌లో ప్రజలందరికీ న్యాయం జరుగుతుందనే ఒక మంచి ఒపీనియన్ ప్రతి సామాన్యుడి లో ఉంది.కష్టాల్లో లేదా ప్రమాదంలో ఉన్న వారికి పోలీసు స్టేషనే గుర్తుకొస్తుంది.అలాంటి పోలీస్ స్టేషన్, పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు తీసుకు వస్తున్నారు కొందరు పోలీసులు.తాజాగా ఉత్తరప్రదేశ్​ లో ఓ పోలీస్​.. పోలీస్​స్టేషన్​ ను మసాజ్​ సెంటర్​ గా మార్చాడు.   ఒక పోలీస్ ఏకంగా చిన్న పిల్లలతో .. అది కూడా పోలీస్ స్టేషన్ లో మసాజ్ చేయించుకున్నాడు.దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.ఈ ఘటన మీర్జాపూర్​ పీఎస్​ లో జరిగింది. వివరాల్లోకి వెళితే....

ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో ఒక హెడ్ పోలీస్ కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్  లో కుర్చీలో కూర్చొని ఉన్నాడు.  అతని వద్దకు ముగ్గురు పిల్లలు వచ్చారు.  వారిలో ఒకరు తలకు మసాజ్​ చేస్తుండగా.. మిగతా ఇద్దరు అతని చేతులను నొక్కుతున్న వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అయింది.  పిల్లల చేత మసాజ్​ చేయించుకున్న హెడ్​ కానిస్టేబుల్​ను భాను ప్రతాప్​ సింగ్​ అని  గుర్తించారు.  దీనికి సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ కావడంతో ... ఈ వీడియో చూసిన నెటిజన్లు పోలీసును బాగా తిట్టిపోస్తున్నారు.ఇదేం పోయేకాలం అంటూ ఆ పోలీస్ కు చివాట్లు పెడుతున్నారు.ఈ వీడియోని మీరు కూడా చూడండి..

నెటిజన్లు పోస్ట్‌లలో పోలీసులను ట్యాగ్ చేయడంతో మీర్జాపూర్ పోలీసులు కూడా వైరల్ వీడియోపై స్పందించారు. ఈఘటనకు సంబంధించి పూర్తి వివరాలు  వివరాలు సేకరించి .,. అవసరమైతే  ఆ హెడ్​ కానిస్టేబుల్​ పై చర్యలు తీసుకోవాలని ఏరియా ఆఫీసర్​ ను ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.  ఈ విషయంపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు చెబుతున్నా... హెడ్​ కానిస్టేబుల్​ పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఇంకా తెలియాల్సి ఉంది.