
EVM ను క్యారీ చేస్తూ… పోలింగ్ సెంటర్ కు వెళ్తున్న ఓ యువతి ఫొటోలు ఇటీవల వైరల్ అయ్యాయి. ఎల్లో కలర్ శారీ కట్టుకుని.. సన్ గ్లాసెస్ పెట్టుకుని.. ఎడమ చేతిలో యాపిల్ ఫోన్… కుడిచేతిలో ఈవీఎం పట్టుకుని.. మెడలో ఈసీ ఐడీ కార్డ్ తో… పోలింగ్ సెంటర్ కు వెళ్తున్న ఓ యువతి ఫొటోలు ఇటీవల చాలామంది ఫోన్లలో తిరిగాయి. సోషల్ మీడియా సెలబ్రిటీగా మారిపోయింది.
ఆమె ఎవరు అనేదానిపై చాలామందిలో ఆసక్తి ఏర్పడింది. ఆమె ఎవరంటే..?
ఆమె పేరు రీనా ద్వివేది. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి. PWD విభాగంలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్తున్నారు. ఎలక్షన్ సమయంలో.. ఎన్నికల వేళ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. మే 5వ తేదీన .. లక్నో కు 50 కిలోమీటర్ల దూరంలోని నగ్రామ్ 173 పోలింగ్ బూత్ లో ఎలక్షన్ డ్యూటీకి వెళ్తూ కెమెరాలను ఆకట్టుకున్నారు.
ఈ ఫొటోలను చూసిన వారంతా.. ఆ పోలింగ్ బూత్ లో భారీ పోలింగ్ పర్సెంటేజీ నమోదవుతుందని అనుకున్నారు. ఇదే విషయం రీనా ద్వివేదిని అడిగితే.. ‘ఔను చాలామందే వచ్చారు.. మా పోలింగ్ బూత్ లో 70 పర్సెంట్ పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది’ అని చెప్పారు.
‘ఒక్కరోజులో దేశమంతటా హైలైట్ కావడం సంతోషంగా ఉంది… చాలామంది ఇపుడు నన్ను ప్రత్యేకంగా చూస్తున్నారు.. సెల్ఫీలు అడుగుతున్నారు.. ఇలాంటి సందర్భాల్లో పాజిటివ్, నెగెటివ్ రెండు రకాల అనుభవాలు కూడా ఎదురవుతుంటాయి. వాటిని నేను ఇప్పుడు ఫేస్ చేస్తున్నా. ఫేమ్ వచ్చినందుకు సంతోషంగా ఉంది’ అన్నారు రీనా ద్వివేది.




