
- మోదీ, అమిత్ షా, జాతీయ నేతల టూర్లపై చర్చ
హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ర్ట ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ మీటింగ్ సోమవారం పార్టీ కార్యాలయంలో జరగనుంది. రాష్ర్ట అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ఎంపీ ఎన్నికల ప్రచారం, రాష్ర్టంలో ప్రధాని మోదీ, అమిత్ షా పబ్లిక్ మీటింగ్ లు, జాతీయ నేతల పర్యటనలు, బస్ యాత్ర, ప్రచార వ్యూహం, సోషల్ మీడియా, మేనిఫెస్టో వంటి అంశాలపై చర్చించనున్నారు.
ఈ మీటింగ్ కు పార్టీ ఎంపీలు లక్ష్మణ్, సంజయ్, అరవింద్, సోయం బాపురావు, పార్టీ ఎమ్మెల్యేలతో సహా ఇతర కీలక నేతలు హాజరు కానున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.