పార్లమెంటు సమావేశాలపై కాంగ్రెస్ వ్యూహ రచన

పార్లమెంటు సమావేశాలపై కాంగ్రెస్ వ్యూహ రచన

న్యూఢిల్లీ:  కాంగ్రెస్ స్ట్రాటజీ గ్రూప్ కమిటీ సమావేశం ఇవాళ ఆదివారం జరిగింది.  10 జన్ పథ్ సోనియా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, ఆనంద్ శర్మ, జై రామ్ రమేశ్, కె సురేశ్ తదితరులు హాజరయ్యారు. రేపటి నుంచి రెండో విడత బట్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కమిటీ ప్రత్యేకంగా భేటీ అయ్యింది. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతంతా చర్చించినట్లు తెలుస్తోంది. నిరుద్యోగం, రైతులకు కనీస మద్దతు ధరలు తదితర సమస్యలపై పార్లమెంట్ లో లేవనెత్తుతామని మల్లికార్జున ఖర్గే తెలిపారు. 

 

ఇవి కూడా చదవండి

దేశ భద్రతపై ప్రధాని అత్యున్నత స్థాయి సమావేశం

ఢిల్లీలో బిజీగా యూపీ సీఎం యోగి

రేపు తన స్వగ్రామంలో కందికొండ అంత్యక్రియలు