ఢిల్లీలో బిజీగా యూపీ సీఎం యోగి

ఢిల్లీలో బిజీగా యూపీ సీఎం యోగి

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ కొత్త సర్కారు ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ కేబినెట్ కూర్పుపై చర్చించేందుకు ఢిల్లీకి చేరుకున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఆయన భేటీ కానున్నారు. కొత్త మంత్రుల ఎంపిక, ఎన్నికల హామీల అమలు తదితర అంశాలపై కేంద్ర నాయకత్వంతో యోగి చర్చించనున్నారు. కేబినెట్ బ్లూ ప్రింట్కు తుదిరూపం ఇవ్వడంతో పాటు ప్రమాణ స్వీకార తేదీని కూడా ఫైనలైజ్ చేయనున్నట్లు సమాచారం. 

హోలీ అనంతరం ఉత్తర్ ప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా  యోగితో పాటు ఒకే రోజున పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. కుల సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ కేబినెట్ కు రూపం ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరిన్ని వార్తల కోసం..

రేపు తన స్వగ్రామంలో కందికొండ అంత్యక్రియలు

కామారెడ్డిలో చిరుత సంచారం