హైదరాబాద్, వెలుగు: ఐపీఎల్ సీజన్ ముగింపు దశకు చేరుకోవడంతో అమెజాన్ మెగా క్రికెట్ ఫెస్టివల్‌ను మొదలుపెట్టింది. క్రికెట్ వస్తువులు, ఫిట్నెస్ గేర్, ఫ్యాన్ మెర్చండైజ్, హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉత్పత్తులపై ఆఫర్లు ఇస్తున్నామని తెలిపింది. ఎస్జీ, డీఎస్‌సీ, నివియా, కాకటూ వంటి ప్రముఖ బ్రాండ్ల వస్తువులపై డిస్కౌంట్లు ఉన్నాయని పేర్కొంది.
అమెజాన్ ఏఐ ఆధారిత షాపింగ్ సాధనమైన రూఫస్ ద్వారా కస్టమర్లు తమ అవసరాలకు అనుగుణంగా సిఫార్సులను పొందవచ్చు. లెన్స్ ఏఐ సహాయంతో బ్రాండ్ పేరు తెలియకపోయినా కేవలం ఫొటోల ద్వారా వస్తువులను వెతకవచ్చు.
కాకటూ కంప్లీట్ క్రికెట్ సెట్ రూ.899 కి, ఎస్జీ క్లాసిక్ బ్యాట్ రూ.1,639 కి లభిస్తున్నాయి. విరాట్ కోహ్లీ బాబుల్‌హెడ్ రూ.749 కి అందుబాటులో ఉంది.
