
‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది నిహారిక. ఆ తర్వాత సూర్యకాంతం, హ్యాప్పీ వెడ్డింగ్ వంటి సినిమాల్లోనూ లీడ్ రోల్ చేసింది. అయినా, అవేవీ ఈ బ్యూటీకి కలిసిరాలేదు. దీంతో పెళ్లి చేసుకుని సెటిలైంది. పెళ్లికి ముందే పింక్ ఎలిఫెంట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించింది. చైతన్యతో విడాకుల రూమర్లు గుప్పుమంటున్న నేపథ్యంలో ఈ మెగా డాటర్ రూటు మార్చింది. తన సినీ కెరీర్‌ను సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. నిర్మాతగా యాక్టివ్ అయ్యి ఓ వైపు వెబ్ సిరీస్‌లను నిర్మిస్తూనే ఫొటో షూట్లతో సందడి చేస్తోంది. ఇందులో లుక్స్ పరంగా తనలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తోంది. మునుపటికన్నా చాలా గ్లామర్‌గా ఉంది. దీంతో నిహారిక హీరోయిన్గా రీఎంట్రీ ఇవ్వనుందనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది.