మెగా DSC అప్లికేషన్ గడువు పెంపు కొత్తగా టెట్ రాసేటోళ్లకు అవకాశం

మెగా DSC అప్లికేషన్ గడువు పెంపు కొత్తగా టెట్ రాసేటోళ్లకు అవకాశం

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి  మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. డీఎస్సీ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 4న ప్రారంభంకాగా..  ఏప్రిల్‌ 2 వరకు ఫీజు చెల్లింపు, ఏప్రిల్ 3తో ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు ముగియనుందని విద్యాశాఖ నోటిఫికేషన్ లో తెలిపింది. తాజాగా టెట్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో డీఎస్సీ దరఖాస్తు గడువును జూన్ 20 వరకు పొడిగించింది. మరోవైపు TS TET - 2024 నోటిఫికేషన్‌ను విద్యాశాఖ మార్చి 14న విడుదల చేసింది. టెట్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన కొద్ది గంటల్లోనే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం విశేషం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 3 లక్షల మంది అభ్యర్థులకు డీఎస్సీ రాసే అవకాశం దక్కనుంది.

అభ్యర్థులు మార్చి 27 నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని విద్యాశాఖ సూచించింది. మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతోపాటు డీఎస్సీ -2024 పరీక్ష తేదీలు కూడా విద్యాశాఖ ఖరారుచేసింది. జులై 17 నుంచి 31 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. 

డీఎస్సీకి దరఖాస్తు చేసేవారి సందేహాలు తీర్చేందుకు అధికారులు హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటుచేశారు. సాంకేతిక సహాయం కోసం విద్యార్థులు 91541 14982, 63099 98812 నంబర్లతోపాటు, helpdesk tsdsc2024@gmail.com ఈ-మెయిల్‌ కు సంప్రదించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునేవారు, ప్రతి ఉద్యోగం కోసం రూ.1000 అదనంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.