రాజుపేటలో మెగా హెల్త్ క్యాంపు

రాజుపేటలో మెగా హెల్త్ క్యాంపు

మంగపేట, వెలుగు:  ఈ నెల 9న మంత్రి ధనసరి అనసూయ ( సీతక్క ) పుట్టినరోజు పురస్కరించుకొని  ఆదివారం సీతక్క పౌండేషన్, భగీరథ కార్డియాక్ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. రాజుపేట సమీప గ్రామాల్లో  కార్డియాక్ సమస్య ఉన్న సుమారు 250 మందికి ట్రీట్ మెంట్ చేశారు. భగీరథ హాస్పిటల్ డాక్టర్లు పేషెంట్ లకు పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులను అందించారు. 

ఈ కార్యక్రమంలో పౌండేషన్ నిర్వహకులు ఎండీ ఇస్సార్ , కర్రి నాగేంద్ర బాబు , భగీరథ కార్డియాక్ కేర్ సెంటర్ డాక్టర్ వైశాలి కాంగ్రెస్ నాయకులు వల్లిపల్లి శివప్రసాద్, తుమ్మల ముఖర్జీ, చందర్లపాటి శ్రీను, గంగెర్ల రాజారత్నం, పళ్ళికొండ యాదగిరి,మురుకుట్ల నరేందర్, ఫయాజ్, పళ్ళికొండ శ్రీవర్మ తో పాటు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.