150 కంపెనీలు, 5 వేల ఉద్యోగాలు.. ఈ అక్టోబర్ 25న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో మెగా జాబ్ మేళా

 150 కంపెనీలు,  5 వేల ఉద్యోగాలు..  ఈ అక్టోబర్ 25న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో మెగా జాబ్ మేళా
  • దాదాపు10 వేల మంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు 
  • జాబ్ మేళాకు హాజరు కానున్న ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు 
  • క్యూ ఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్లు 

సూర్యాపేట, వెలుగు: నిరుద్యోగుల కోసం సూర్యాపేట జిల్లాలో ఈ నెల 25న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో అక్టోబర్ 25న హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించనున్న మెగా జాబ్‌‌‌‌‌‌‌‌ మేళాలో 150కి పైగా కంపెనీలు పాల్గొననుండగా 5 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించనున్నారు.  

10వ తరగతి అర్హతతో..

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, తెలంగాణ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ (డిఈఈటీ) సహకారంతో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు.  ఐటీ, ఫార్మా, ఈ -కామర్స్, ట్రేడ్, మాన్యుఫ్యాక్చరింగ్, ఐటీఈఎస్, బీపీఓ, బయోటెక్నాలజీ రంగాలకు చెందిన కంపెనీలు ఇందులో పాల్గొంటాయి. 10వ తరగతి నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల వరకు అర్హత కలిగిన అభ్యర్థులు హాజరై కెరీర్ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచిస్తున్నారు. హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్, కోదాడ ప్రాంతాల యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయనున్నారు.

క్యూ ఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్

ఈ జాబ్ మేళాలో మొత్తం150 కంపెనీలు పాల్గొంటాయి.  జాబ్ మేళా ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించనున్నారు. 10 వేల మందికి పైగా నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరయ్యే అవకాశం ఉంది. మొత్తం 3 నుంచి 5 వేల మంది నిరుద్యోగులకు జాబ్స్ ఇవ్వనుండగా ఇందుకోసం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు.  జాబ్ మేళా లో పాల్గొనే నిరుద్యోగులు టెన్త్ పాస్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, బీటెక్, పీజీ, ఫార్మసీ కోర్సుల్లో ఉత్తీర్ణత పొందిన 18 నుండి 40 ఏళ్ల వయస్సు కలిగిన యువతీ, యువకులు పాల్గొనడానికి అర్హులు.  ఇందుకోసం ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ద్వారా పేర్లు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. 

ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వెనుక పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ నెల 25న నిర్వహించనున్నారు. రిజిస్ట్రేషన్ కోసం నిరుద్యోగుల కోసం మేళా వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ సేవలు అందించడానికి కంప్యూటర్లు, ప్రింటర్లు, జిరాక్స్ మిషన్లు వంటి అవసరమైన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.  జాబ్ మేళాలో 10 వేల మందికి మించి నిరుద్యోగులు పాల్గొనే అవకాశం ఉన్నందున ఎవరికి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.

యువత సద్వినియోగం చేసుకోవాలి 

చాలా మంది చదువుకున్న యువతీ యువకులకు సరైన ఉద్యోగాలు రాకపోవడం బాధాకరం.  మన ప్రాంతంలో కొంతమంది యువతీ యువకులకు ఉద్యోగాలు ఇప్పించాలనే తపనతో హుజూర్ నగర్ లో అక్టోబర్ 25న జాబ్ మేళా నిర్వహిస్తున్నాం.  సుమారు 150 కు పైగా ప్రతిష్టాత్మకమైన కంపెనీలను ఈ జాబ్ మేళాకు ఆహ్వానించాం. నిరుద్యోగ యువత పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి