
గోదావరిఖని, వెలుగు: ఈ నెల 18న గోదావరిఖని సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించనున్న మెగా జాబ్‌మేళాను నిరుద్యోగులు వినియోగించుకోవాలని ఆర్జీ 1 ఏరియా జీఎం డి.లలిత్‌కుమార్ కోరారు. మంగళవారం జీఎం ఆఫీస్‌లో జరిగిన మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌కు చెందిన నోబుల్ ఎడ్యుకేషనల్ ఎంపవర్‌మెంట్ సొసైటీ సౌజన్యంతో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన నిరుద్యోగుల కోసం ఈ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
జాబ్‌మేళా నిర్వహించే సింగరేణి కమ్యూనిటీ హాల్‌ను ఆఫీసర్లు, కాంగ్రెస్ లీడర్లతో కలిసి జీఎం పరిశీలించారు. 10 వేల మంది నిరుద్యోగులకు సరిపడేలా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు జీఎం డి.లలిత్‌కుమార్ వివరించారు.