
ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ పట్టణంలోని ఈ నెల 12న మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్ తెలిపారు. గురువారం ఖానాపూర్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు 60కి పైగా ప్రముఖ కంపెనీలతో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నామని, పెద్ద ఎత్తున జరిగే జాబ్ మేళాకు నిరుద్యోగులు తరలివచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జాబ్ మేళాకు సంబంధించిన వాల్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ దిలీప్, మాజీ జడ్పీటీసీ రాము నాయక్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్దుల్ ఖలీల్, మాజీ ఎంపీపీ మోహిద్, బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు రాజ గంగన్న, రాజు తదితరులు పాల్గొన్నారు.