మెగా 154 మాస్ గ్లింప్స్

మెగా 154 మాస్ గ్లింప్స్

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. పవర్ ఫుల్ డైరెక్టర్ ‘బాబీ’ దర్శకత్వంలో  చిరంజీవి 154వ సినిమా చేస్తున్నారు.  ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ వీడియో అదిరిపోయింది. స్టైల్ గా చేతిలో బీడీ నోట్లో పెట్టుకున్నారు. పూనకాలు లోడింగ్ అంటూ బాబీ ట్వీట్ చేశారు. డీఎస్పీ నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. ఫస్ట్ గ్లింప్స్ ఈ రేంజ్ లో ఉంటే.. టైటిల్ టీజర్ పూనకాలు తెప్పించేలా ఉంటుందని అనుకుంటున్నారు. అక్టోబర్ 24న ఉదయం 11.07 నిమిషాలకు టైటిల్ టీజర్ ప్రకటిస్తామని చెప్పడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

మెగాస్టార్ 154 మూవీకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. అయితే ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య ’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం  మైత్రి మూవీస్ బ్యానర్పై తెరకెక్కుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. శ్రుతి హాస‌న్, మెగాస్టార్కు జోడీగా నటిస్తోంది. ఇందులో చిరంజీవి త‌మ్ముడి పాత్రలో హీరో ‘ర‌వితేజ’ క‌నిపించ‌బోతున్నారు. చిరంజీవి 154 మూవీ షూటింగ్‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.