అక్టోబర్ 11న పాలమూరు వర్సిటీలో మెగా ప్లేస్మెంట్ డ్రైవ్

అక్టోబర్ 11న పాలమూరు వర్సిటీలో మెగా ప్లేస్మెంట్ డ్రైవ్

హైదరాబాద్, వెలుగు: మహబూబ్‌నగర్​లోని పాలమూరు  వర్సిటీలో ఈ నెల 11న  పురుష అభ్యర్థులకు ప్రత్యేకంగా మెగా క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. బల్క్ డ్రగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ సహకారంతో  దీన్ని చేపట్టినట్టు  వెల్లడించారు. దేశవ్యాప్తంగా 500 ఫార్మా అండ్ బల్క్ డ్రగ్ కంపెనీల ప్రాతినిధ్యం ఉన్న అసోసియేషన్‌తో కౌన్సిల్ ఒప్పందం చేసుకున్నదన్నారు. ఈ డ్రైవ్‌కు 2021 నుంచి 2025 బ్యాచుల వరకు ఉన్న పురుష అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఎంఎస్సీ కెమిస్ర్టీ, మైక్రోబయాలజీ, ఎంఫార్మసీ, బీఫార్మసీ, బీటెక్ మెకానికల్, ఎలక్ట్రికల్​, కెమికల్, బీఎస్సీ కెమిస్ట్రీ, ఇంటర్, ఐటీఐ అభ్యర్థులంతా అర్హులేనని చెప్పారు. ఎంపికైన అభ్యర్థులు క్యూసీ, క్యూఏ, కెమిస్ట్, మిషన్ ఆపరేటర్‌‌గా  నియమితులు కానున్నారు.